ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు1రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు గురువారం అంతరాయం ఏర్పడడంతో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల ఆర్టీసీ డిఎం.A.ప్రకాష్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం, D.శ్రీనివాస్ ఇరువురు డిపో మేనేజర్‌లు ఒకేసారి కుర్చీలను వదిలి సిరిసిల్ల పాతబస్టాండ్‌కు చేరుకున్నారు. ఒకేసారి నాలుగు బస్సులు వెళ్లడం గమనించిన డీఎంలు బస్టాండ్ లోనే బస్సు డ్రైవర్లకు నిర్ణీత సమయాలకు నడపాలని పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రయాణికులు ఆర్టీసీ సేవలు సరిగ్గా అందడం లేదని అంటున్నారు. అదే విధంగా బస్సులు సమయపాలన పాటించక పోవడంతో ప్రయాణికులు విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుగ్రామాల మీదుగా వచ్చేపోయే బస్సులు సమయపాలన పాటించక గమ్యాలకు చేరుకోలేకపోతున్నా సందర్భాలు ఉన్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఎట్టకేలకు డిపో మేనేజర్లు స్పందించి సరైన సమయానికి నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు.




