చేయి చేయి కలిపి.. మిత్రుని కుటుంబానికి భరోసా కల్పించారు
-కలిసి చదువుకున్నారు కష్టాల్లో అండగా ఉన్నారు.
-స్నేహితుని కుటుంబానికి 40 వేలు, క్వింటాల్ బియ్యం అందజ
సిద్దిపేట జిల్లా జులై 28
దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన నీరటి రాజశేఖర్ అకాల మరణంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న తమ డిగ్రీ బ్యాచ్ స్నేహితులు పల్లెటూరు ప్రసాద్, శాంసన్,రాజు, శేఖర్,విద్య సాగర్, క్రిష్ణ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 40 వేల రూపాయలు , క్వింటాల్ బియ్యాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అతని స్నేహితులు మాట్లాడుతూ చిన్న వయసులో మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు .స్నేహితుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు . బాధిత కుటుంబ పరిస్థితిని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు.
