ముస్తాబాద్/నవంబర్/11; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో మొక్కల పరిస్థితి ఇంతేనా..! మన రాష్ట్ర ప్రజలబాగుకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు పెట్టి మొక్కలను నాటిస్తోంది. నాటిన మొక్కలను పరిరక్షించడం కోసం ప్రత్యేక నిధులు కూడా ఏర్పాటు చేసింది. అట్టి నిబంధనలను ఉల్లంఘించి తుంగలో తొక్కేసి ముస్తాబాద్ కేంద్రంతోపాటు పలుగ్రామాలలో నాటిన మొక్కలకు పరిరక్షణ లేక అద్వానా పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాలలో గుంతలు తీశారు. కానీ మొక్కలను నాటడం మరిచారు. మరికొన్ని చోట్ల నాటిన మొక్కలకు పరిరక్షణను మరిచారు. ఇదేం పరిస్థితని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తూ ప్రజలకు మంచి వాతావరణాన్ని ఇచ్చే మొక్కలను కాపాడకపోతే ఇంకా గ్రామాన్ని ఏమీ కాపాడతారని మండల ప్రజలు అంటున్నారు అధికారులు నిర్లక్ష్యం వల్లే మండలంలోని మొక్కలు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి మొక్కలను సరిగా నాటించి రక్షించాలని కోరుతున్నారు.
