ఏసిరెడ్డి నర్సింహారెడ్డి సేవలు మరువలేనివి
సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి
సిద్దిపేట జిల్లా జూలై 28
జనగామ మాజీ ఎమ్మెల్యే ఏసిరెడ్డి నర్సింహారెడ్డి సేవలు మరువలేనివని. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏసి రెడ్డి నర్సింహారెడ్డి, జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకమని చిన్నతనం నుండి విప్లవ భావాలకు ఆకర్షితుడై ఆంధ్ర మహాసభలో చేరి నాడు ఆలేరులో జరిగిన ఆంధ్ర మహాసభ పై పోలీసులు జరిపిన కాల్పుల్లో తన తొడ నుండి తూటా బయటికి వెళ్లిన జనక లేదన్నారు. అప్పటినుండి సిపిఎం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకు అంకితం చేస్తూ పెళ్లి కూడా చేసుకోకుండా గడిపిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించారని. ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన గొప్ప నాయకుడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఎండి షఫీ, నాయకులు పిడిశెట్టి సాయిలు, చిలక యాదగిరి, బాబు, సూర కనకరాజు, యాదగిరి, యాదయ్య, మురళి, ఎండి సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
