రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి21:
ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి 10 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఓ గంగయ్య, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
