మహిళ సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మహిళలు సిద్ధంగా ఉండాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు వంగ జయరెడ్డి
సిద్దిపేట జిల్లా జూలై 27
చేర్యాల మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు వంగ జయరెడ్డి అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమపథకాలు మహిళల పేరిట అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని, మహిళలు రాజకీయల్లో రాణించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా మహిళా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
