ముస్తాబాదులో
ముస్తాబాద్ జనవరి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి సేవలు మరువలేనివి అంటూ కొనియాడారు. రాహుల్ గాంధీ గత 130 రోజులకు పై చిలుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ ప్రజల మద్దతుతో 3000 కిలోమీటర్లకు పైచిలుకు యాత్ర చేస్తూ అణగారిన వర్గాలకు దేశంలో చెలరేగుతున్న ద్వేశం హింసకు వ్యతిరేకంగా శాంతి నెలకొలపాలని దేశానికి భరోసా ఇస్తూ సాగినయాత్ర ఈరోజు విజయవంతంగా కాశ్మీర్లో ముగిసిందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగారి శ్రీనివాస్, నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గన్నెబాను, సీనియర్ నాయకులు ఓరగంటి తిరుపతి, వెలుముల రాంరెడ్డి, దీటి నర్సింలు, ముద్దం రాజు, ఉచ్చిడి బాల్ రెడ్డి, ఆగుళ్ల రాజేశం, కొమురయ్య, రంజాన్ నరేష్, సారుగు రాకేష్, శివ, సద్ధి మధు, షాబిల్ తదితరులు పాల్గొన్నారు.




