ప్రాంతీయం

బహిరంగ ప్రదేశాలలో ధూమపానం.. అడ్డాలుగా స్థావరాలు…

154 Views

ముస్తాబాద్, జూలై 24 (24/7న్యూస్ ప్రతినిధి):   యువత మాదకద్రవ్యాల పట్ల అలవాటు సమాజానికి నష్టం కలుగుతుందని అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. పట్టణంలోనే కాకుండా పట్టణం మాదిరిగా గ్రామీన ప్రాంతానికి పాకింది మత్తు పదార్థాలకు రకరకాల రూపంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు నానాటికి ధూమపానానికి బానిసలు అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాను రాను ధూమపానానికి సరదాగా మొదలై  క్రమక్రమంగా అలవాటుపడి పూర్తిగా బానిసలవుతూ మద్యపానం గంజాయి మరేతర మాదకద్రవ్యాలు సేవించే విధంగా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాలలో మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉన్న టీ పాయింట్ల వెనుక సైడు అడ్డాలుగా స్థావరాలు ప్రేరేపణ చేస్తున్నాయని బాటసారులు భావిస్తున్నారు. యువతను వ్యసనాలకు బానిసలు కాకుండా పోలీస్ శాఖ నిఘావేసి టీ పాయింట్లకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్