ఆధ్యాత్మికం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామకోటి రామరాజుకు ఘన సన్మానం

52 Views

– 25 సంవత్సరాల సేవకు దక్కినదే భక్తిరత్న జాతీయ
అవార్డు
– రామకోటి రామరాజు

గజ్వేల్,జులై 25

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఇటీవల భక్తిరత్న జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు అన్నేబోయిన మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు అన్నేబోయిన మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రామకోటి రామరాజు ప్రజలను భక్తిమార్గం వైపు మల్లె విధంగా కృషి చేస్తూ ప్రతి వ్యక్తిచే రామనామాన్ని లిఖింపజేపిస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రల వ్యాప్తంగా మరో భక్త రామదాసుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వకారణం అన్నారు. 25సంవత్సరాల నిర్వీరామ కృషి, పట్టుదల అమోఘం అన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్ నంగునూరి సత్యనారాయణ, లయన్ రావికంటి చంద్రశేఖర్, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ గుడాల శేఖర్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్