ప్రాంతీయం

చెరువుల మరమ్మత్తులు చేపట్టండి

77 Views

*చెరువులకు మర మత్తులు చేపట్టండి*

*పోడు భూములకు పట్టాలు ఇవ్వండి*

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అంకెపల్లి, బోరుకుంట చెరువులకు మరమ్మత్తులు చేయాలని ఎంపిటిసి సిరంగి శంకర్,కాంగ్రెస్ నాయకుడు సార్ల రమేష్ లు కోరారు. సోమవారం రోజున రైతులతో కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వర్షాకాలంలో అంకె పెళ్లి బోర్కుంట చెరువులలో మత్తడలు తెగిపోయి నీరు వృధాగా పోతుందని తద్వారా రైతులు నష్టపోతున్నారని వారన్నారు.అంకెపల్లి చెరువు కింద 70 ఎకరాలు, బోరుకుంట చెరువు కింద 80 ఎకరాలు సాగవుతున్నాయని త్వరగా మరమ్మత్తులు చేయాలని అన్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన 17 ఎస్టి మన్నెవార్ కోలవార్ కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్నారని ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు అందజేయాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్