(తిమ్మాపూర్ జూలై 22)
బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో శవమై తేలాడు. ఈ విషాద ఘటన సోమవారం తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.
ఎల్‌ఎండీ పోలీసులు తెలిపిన వివరాల పకారం..మొగిలిపాలెం గ్రామానికి చెందిన జవ్వాజి సాయికృష్ణ(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజులాగానే సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి అన్నంతిని తిరిగి పాఠశాలకు వెళ్లిన అనంతర తన స్నేహితులతో కలిసి సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి, చెరువులో దిగాడు ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి ఈత రాక నీట మునిగి మృతిచెందాడు….