Breaking News

ఈరోజు జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

100 Views

 

ఈరోజు జి.ఎం ప్రదర్శనని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం.ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల సమీక్షతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా లో గనుల వారీగా నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సమిష్టి కృషితో అధిగమించాలని అన్నారు.
అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులలో నిర్దేశిత ఓ.బి. తీసివేత పనుల గురించి మరియు ఉత్పత్తి చేసిన బొగ్గు రవాణాను సక్రమంగా నిర్వహించాల్సిన అవశ్యకతపై అధికారులకు సూచనలు సలహాలు తెలియజేసారు. అదేవిధంగా అన్ని గనులకు కావలసిన యంత్రాలు యంత్రాల సామాగ్రి ఎలక్ట్రికల్ మిషనరీ మొదలగు వాటి గురించి ఆరా తీశారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల పోస్టర్లను జి.ఎం.ఏ మనోహర్ మరియు సింగరేణి అధికారులు ఆవిష్కరించారు. నవంబర్ 15 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించాల్సిందిగా సెంట్రల్ విజిలెన్స్ విభాగం ఉత్తర్వులు జారీ చేసిందని జి.ఎం.ఏ. మనోహర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, డీజీ.ఎం ఐడీ రాజన్న ఏజిఎం ఈ అండ్ ఎం నాగరాజు కె.కే ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, శాంతి కని ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయ్ కుమార్, సిఎం ఓ ఏ ఐ అధ్యక్షులు పైడిశ్వర్ డీజీఎం సివిల్ శ్రీనివాసులు, మరియు అన్ని గనుల మేనేజర్లు, ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *