ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

47 Views

*ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి – సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*

*కాగజ్ నగర్ :* పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు, ఎంఎల్సీ దండే విఠల్, జిల్లా ఉప పాలనాధికారి దీపక్ తివారి, మునిసిపల్ చైర్మన్ షాహీన్ సుల్తానా, మునిసిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు.

ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొనాలని, ప్రతి ఒక్కరు ఒక్కో మొక్కను నాటి దాన్ని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు. జిల్లాలో  అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉన్నదని తెలియజేశారు.

అలాగే ఫారెస్ట్ సిబ్బంది అడవుల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలలో కూడా చెట్లు నాటాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్