ప్రాంతీయం

బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన కోటపల్లి పోలీసులు

99 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*బ్రిడ్జ్ మరమ్మత్తులు చేపించిన కోటపల్లి పోలీసులు*

చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి కురిసిన వర్షం కారణంగా నక్కలపెళ్లి కి వెళ్ళు మార్గంలో ఉన్న లోలెవల్ వంతెన కొట్టుకు పోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది అని ప్రజల అవస్థలను గుర్తించి అట్టి విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్,ఎస్.ఐ కోటపల్లి రాజేందర్ లు నీటి ప్రవాహానికి పాడైపోయిన వంతెన వద్దకు చేరుకుని స్థానికంగా ఉన్న ఒక JCB తెప్పించి వంతెనకు ఈ రోజున ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురికాకూడదు అని మానవతా దృక్పదం తో తాత్కాలిక రోడ్ మరమ్మతులు చేయించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకొని రోడ్డు మరమ్మత్తులు చేపించిన పోలీస్ అధికారుల స్పందన తీరుకు నక్కలపల్లి, బద్దంపల్లి, బ్రహ్మనపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.

*ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ…* పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. వర్షం కారణంగా చెరువులు, నాళాలు, వాగులు నిండి మరియు కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించు కోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చర్యలు చేయడం ప్రమాదకరంఅన్నారు. చెన్నూర్ రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.

ఇట్టి కార్యక్రమంలో స్థానికులు శ్రవణ్ రెడ్డి, అశోక్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్