ప్రాంతీయం

మంచిర్యాలలో రేపటి నుండి సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలు

84 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో రేపటి నుండి డిసెంబర్ 21 వరకు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభం.

మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఈ నెల 17 నుండి డిసెంబర్ 21 వరకు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడా పోటీలను జరుగుతాయని డివైఎస్ఓ కీర్తి రాజావీరు తెలిపారు. డిసెంబర్ 17న మంచిర్యాల జడ్పీ హైస్కూల్ మైదానంలో వాలీబాల్, బాస్కెట్బాల్, నెట్ బాల్ మరియు యోగ నిర్వహిస్తారు. 18న కబడ్డీ, కిక్ బాక్సింగ్, మరియు తైక్వాండో పోటీలను నిర్వహించనున్నారు. 19న ఖోఖో, బేస్ బాల్, ఫుట్ బాల్, చెస్ మరియు అథ్లెటిస్ పోటీలను నిర్వహించనున్నారు.20న కరాటే, జూడో, హ్యాండ్ బాల్ మరియు ఉష్ పోటీలను నిర్వహిస్తారు. 21న స్విమ్మింగ్, టిటి మరియు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్