వ్యవసాయం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

165 Views

-లక్ష రూపాయల రుణమాఫీ చేసిన కాంగ్రెస్

-హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

(తిమ్మాపూర్ జూలై 18)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రైతు రుణమాఫీ ఉత్సవాలు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో హర్ష వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేస్తూ, సీట్లు పంచుతూ టపాసులు కాల్చరు. అనంతరం తిమ్మాపూర్ రైతు వేదిక నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు..

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది.. ఇచ్చిన మాట ప్రకారం గురువారం 11 లక్షల రైతులకు 7 వేల కోట్లను విడుదలచేసిందని,మిగతా రైతులకు ఈ నెలాఖారున లక్ష 50 వేలు, ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని ఆశభావం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హమిలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న
ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు ..

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్