ప్రాంతీయం

93వ ఆషాడ ఉత్సవాలు

88 Views

ఘనంగా పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు

-అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు 

-హరినామ కీర్తనలతో మారుమోగిన పాండురంగ ఆశ్రమం

గజ్వేల్,మర్కుక్,జూలై17

మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.తొలిఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి విశిష్ట పూజలు అఖండ భగవనామము కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు హైదరాబాదు నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.హరే రామ హరే రామ,రామ రామ హరే హరే,హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ హరి నామ సంకీర్తనలతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.18వ తేదీ రోజున ద్వాదశి అన్నపూజ అఖండ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగును అని ఆశ్రమ యజమానులు పూజారులు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found