క్రీడల్లో రాణించి గజ్వేల్ కు మంచి పేరు తేవాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో డిసెంబర్ 3వ 4వ తారీకు జాతీయ కరాటే బుడో ఖాన్ పోటీలకు ఎంపికైన నలుగురు క్రీడాకారులను, స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ సిద్దిపేట జిల్లా సెక్రటరీ ఎస్.నరేష్ కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు అవంతిక, దేవాన్ష్ రెడ్డి, భినీత, దీక్షత,ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని తెలంగాణ వచ్చిన తర్వాత క్రీడల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ యువత క్రీడల పైపు మల్లె విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస యువజన నాయకులు ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యువజన అద్యక్షులు నేతి చిన సంతోష్, తెరాస పట్టణ కోశాధికారి కొమురవెల్లి ప్రవీణ్, నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, రాము, నరేందర్, భాస్కర్, బ్లాక్ బెల్ట్ సీనియర్స్ శ్రీకాంత్ , సురేష్ , నరేందర్ తదితరులు పాల్గొన్నారు
