30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022, జిల్లా స్థాయి ప్రదర్శన పోటీలను తేదీ 19/11/2022. వేదిక టీటీసీ భవన్, సిద్దిపేటలో నిర్వహించిన పోటీలో రాయపోల్ పరిధిలోని బేగంపేట్ విద్యార్థి మాస్టర్. బోయిని మనోజ్ కుమార్ (9వ తరగతి) మార్గదర్శి ఉపాధ్యాయులు యరమాల చిన్న బ్రహ్మయ్య. (భౌతిక శాస్త్రం) ప్రోత్సహంతో “ప్లాస్టిక్ వ్యర్ధాలు. మానవునికి చేసే హానీ – వాటి పర్యావరణ అనుకూల పరిస్కారాలు అనే అంశం ఫై అత్యున్నత ప్రదర్శన చేసి వచ్చిన 90 ప్రదర్శనలో జిల్లా మొదటి బహుమతిని పొందుతూ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎన్నికైన సందర్బంగా విద్యార్థి బి. మనోజ్ కుమార్, గైడ్ టీచర్ వై. చిన్న బ్రహ్మయ్యని అభినందించిన పాఠశాల గేజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్, ఎస్ యం సి చైర్మన్, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎ.నవీన్ కుమార్, టి. రాములు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలుపుతూ రాష్ట్ర స్థాయిలో కూడా చక్కని ప్రదర్శన చేసి జాతీయ స్థాయికు ఎంపిక కావాలని ఆశభావం వ్యక్తపరిచారు.
