*జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు విఫలం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి అధ్యక్షతన మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేకు మంత్రి పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని అన్నారు. ప్రేమ సాగర్ గత ఎన్నికల సమయంలో ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో ఎల్లంపల్లి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మంచిర్యాల – ఆంతర్గం బ్రిడ్జి నిర్మాణం పై ఊసే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రైతులకు, మహిళలకు, యువతకు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పై మరియు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, పెద్దపల్లి పురుషోత్తం, కొయ్యాల ఏమాజీ, అమరాజుల శ్రీదేవి, అందుగుల శ్రీనివాస్, బూస నర్సింహులు, ముదాం మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల ఇంఛార్జిలు మరియు తదితరులు పాల్గొన్నారు.





