ప్రాంతీయం

యువకులకు డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ అందజేత

205 Views

దౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న వారికి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ లు అందజేస్తున్నామని అప్పాయిపల్లి ఉపసర్పంచ్ ప్రభాకర్, బీజేపీ నాయకులు రుక్మేందర్ లు అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ గ్రామాలకు చెందిన యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని యువకులు అందరికీ ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావు తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అప్పాయిపల్లి గ్రామ అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *