ప్రాంతీయం

ఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే 

125 Views

ఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ (మార్చి 19) ఈరోజు బోయిగూడా సికింద్రాబాద్ లో ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు జంగిలి ప్రశాంత్ కుసుమ కవిత మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు లీగల్ అడ్వైసర్లు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగిలి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజల్లో చట్టంపై అవగాహన కలిగించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడే తమ సమస్యలు పరిష్కారానికి మార్గం చూపుతాయని సూచించడం జరిగింది ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ప్రథమ కర్తవ్యం అవినీతి రహిత సమాజాన్ని చూడాలన్నదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మర్కుక్ మండల్ అధ్యక్షునిగా చేబర్తి గ్రామానికి చెందిన పోయిల ఆంజనేయులు ఉపాధ్యక్షునిగా పాతూరు గ్రామానికి చెందిన నర్సింలను నియమించారు మరియు గజ్వేల్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా రెప్పల స్వామిని. గజ్వేల్ డివిజన్ జాయింట్ సెక్రటరీగా చింతకాయల స్వామిని నియమించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పోయిల ఆంజనేయులు మాట్లాడుతూ నాపై నమ్మకాన్ని ఉంచినందుకు జంగలి ప్రశాంత్ మరియు సిద్దిపేట జిల్లా జాయింట్ సెక్రెటరీ కుంట సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా నా వంతు కృషిగా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ మరియు అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పడం జరిగింది

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *