Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ

78 Views

కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు రాజు నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న ప్రభుత్వ లాంచనాలతో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో లాంచనంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అయితే ఈ చెక్కులని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఏడు నెలలు కెసిఆర్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన చెక్కులని రాష్ట్రవ్యాప్తంగా 700 కోట్ల పైగా విడుదల చేయడం జరిగిందని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బానోతు రాజు నాయక్ మాట్లాడుతూ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఒకప్పుడు చెక్కుల పంపిణీ అంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏదో తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి అందించడం జరిగింది ప్రజా పాలన అద్దం పట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్