గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బి సి సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ సౌజన్యంతో సోమవారం పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల కనకయ్య స్వరూప కుమార్తె నిత్య వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు పుస్తే మెట్టెలు మ్యాకల కనకయ్య, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, పాములపర్తి, పాతూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేష్,మల్లేశ్ ముదిరాజ్, చెక్కల నర్సింలు చేతుల మీదగా అందజేశారు, ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని అన్నారు సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని ఆడపిల్ల పెళ్లికి ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేసి ఆడపిల్ల మేనమామ లాగా అందరి మన్నన పొందుతున్నారని రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు