ప్రాంతీయం

ఎంఈఓ గా బండి నరసమ్మ సేవలు మరువలేనివి. ఎంఈఓలు కనుక రాజు, సత్యనారాయణ రెడ్డి.

115 Views

ఉమ్మడి రాయపోల్, దౌల్తాబాద్ మండలాల ఎంఈఓగా తొమ్మిది సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించిన బండి నర్సమ్మకి మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండలాలకు సేవాలాందించిన ఎంఈఓ నర్సమ్మకి దౌల్తాబాద్ మండల విద్యాధికారి కనకరాజు, రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి నరసమ్మ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 100% వచ్చే విధంగా 9 సంవత్సరాలుగా ఉమ్మడి మండలాలకు ఎంతో కృషి చేస్తారని వారు పేర్కొన్నారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులతో సమన్వయం చేస్తూ ప్రగతిపతంలో నడిపిన బండి నరసమ్మ దుబ్బాక మండలానికి బదిలీపై వెళ్లడం ఎంతో బాధాకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉమ్మడి మండలాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉమ్మడి మండలాల ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు, ఉమ్మడి మండలాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, ఉమ్మడి మండలాల సిఆర్పిలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ లు తదితరులు పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found