ప్రాంతీయం

జగదేవపూర్ లో మరో డెంగ్యూ కేసు

172 Views

 

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం( 24/7 తెలుగు న్యూస్) :- సీజనల్ వ్యాధితో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో జగదేవపూర్ గ్రామంలో సీజనల్ వ్యాధితో పాటు డెంగ్యూ వ్యాధి ఒక యువకున్ని బలికొనగా మరో విద్యార్థికి  సోకినట్లుగా తెలియవచ్చింది జగదేవపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి రిషిరాజ్ పదవ తరగతి విద్యార్థి కి ఈనెల 7వ తేదీన డెంగ్యూ వ్యాధి రావడంతో హైదరాబాదులో గల యశోద హాస్పిటల్ లో విద్యార్థిని చేర్పించడం జరిగిందని విద్యార్థి తండ్రి తెలిపారు. గ్రామంలో ఇది రెండో కేసు కావడంతో ప్రజల్లో  భయాందోళనలు  మొదలయినవి పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడం వలన జగదేవపూర్ గ్రామంలో సీజనల్ వ్యాధితో పాటు డెంగ్యూ వ్యాధి ప్రబలడం పరిసరాల పరిశుభ్రత సరిగా లేనందుని ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు దీనిపైన గ్రామపంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు గ్రామం బయట ఉండవలసిన పాత ఇనుప సామాన్ (షెడ్లు) గోదాములు గ్రామంలో ఉండడం చేత ఈ పరిస్థితి నెలకొందని రిషి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి గ్రామంలో ప్రజలకు నెలకొంటుందని ఇప్పటికైనా అధికారులు మేలుకొని గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రం చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.పాత ఇనుప సామాను గోదాముల యజమానులకు నోటీసులు అందజేశాము.గ్రామంలో పాత ఇనుప సామాను గోదాములు ఏర్పాటు చేయడం నిజమేనని గోదాములను వెంటనే గ్రామంలో నుండి కాల్ చేయాలని గోదావరి తెలియజేయడంతో పాటు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని జగదేవపూర్ గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ తెలిపారు త్వరలోనే గోదాముల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *