సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 8 రోజుల నుండి గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కోసం,
1) సబ్ కోర్ట్ సాధన 2) జిల్లా కోర్టు సాధన 3) నూతన కోర్ట్ భవన సముదాయం కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం తెలంగాణ హైకోర్టు గుర్తించి నిన్నటి రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం గారు గజ్వేల్ కోర్టుకు విచ్చేసి న్యాయవాదుల యొక్క న్యాయమైన డిమాండ్లను గుర్తించామని మరియు గజ్వేల్ కు సబ్ కోర్ట్ , జిల్లా కోర్టుకు కవలసినటువంటి అన్ని హంగులు ఉన్నాయని గుర్తించి, దీనికి సంబంధించిన రిపోర్ట్ ని తక్షణమే హైకోర్టు పంపిస్తున్నాను అని చెప్పి,
న్యాయవాదులను తమ యొక్క విధులను నిర్వర్తించాలని అభ్యర్థించినారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథి మాట్లాడుతూ మా ఎనిమిది రోజుల నిరసన కార్యక్రమాలు ఫలించి జిల్లా జడ్జి రఘురాం గజ్వేల్ కోర్టు సందర్శించి హైకోర్టుకు రిపోర్ట్ పంపిస్తా అని హామీ ఇచ్చినందుకు సంతోషం, కానీ గజ్వేల్ రావలసిన సబ్ కోర్ట్, జిల్లా కోర్టు గురించి రేపు సోమవారం రోజున వంట వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని పత్రికా ముఖంగా చెప్పారు, ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్స్ న్యాయవాదులు పాల్గొన్నారు.
