ప్రాంతీయం

జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలి

69 Views

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూధాన్, అసైన్డ్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలి.

చట్టాలను తుంగలో తొక్కిన కొమ్మూరి ప్రతాపరెడ్డినీ జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలి

సిద్దిపేట జిల్లా జూలై 12

చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి భూ ఆక్రమణలపై చేర్యాల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ(ఎం), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ,తెలుగుదేశం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టి ఎం ఆర్ పి ఎస్) మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలుగుదేశం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కి తన అధికార ధనబలంతో ప్రభుత్వ అధికారులను లోబర్చుకొని చేర్యాల ప్రాంతంలో చేర్యాల టౌన్, ముస్త్యాల, లద్నూరు, బంజార గ్రామాలలో 30 ఎకరాల 21 గుంటల విస్తీర్ణం గల ప్రభుత్వ భూదాన్, అసైన్డ్ మిగులు భూములను పేదల నుండి లాక్కొని ధన బలంతో ,అధికార బలంతో ఈ ప్రాంత ప్రభుత్వ రెవెన్యూ, సబ్ రిజిస్టర్ అధికారులను లోబర్చుకొని తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఏదేచ్ఛగా భూమిని అనుభవిస్తున్నాడని ఇది అత్యంత దుర్మార్గమైన చర్య దీనిని ఖండిస్తున్నామని ప్రజలు మేధావులు కొమ్మూరు ప్రతాపరెడ్డి చేస్తున్న భూ అక్రమ లను ఎండగట్టాలని, పేదలకు దక్కాల్సిన భూములను ఆక్రమించి అనుభవిస్తున్న ఇతనికి ప్రభుత్వ భూదాన్, అసైన్డ్ చట్టాల గురించి అవగాహన ఉండి కూడా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంలా వ్యవహరిస్తూ చట్టాలను అతిక్రమించి భూములను కబ్జా చేసి రికార్డు చేయించుకొని భూమిని అనుభవిస్తున్న కొమ్మూరి ప్రతాపరెడ్డినీ అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని పదవి నుండి వెంటనే తొలగించాలని, చేర్యాల శివారు1030 సర్వే నంబర్ లో ఏడెకరాల ఒక గుంట విస్తీర్ణం, భూదాన్ భూమి చేర్యాల బిడి కాలనీకి అతి సమీపంలో గల దానిని ప్రభుత్వం స్వాధీనపరచుకొని చేర్యాల పట్టణంలోని ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు పంపిణీ చేయాలని, 984,985,997 సర్వే నంబర్లలో నిబంధన ల కు వ్యతిరేకంగా వెంచర్ చేసి మున్సిపాలిటీకి ప్రజల అవసరాలకు వదిలి పెట్టాల్సిన రెండెకరాల భూమిని ఇవ్వకుండా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని ఈ భూమిని క్రయవిక్రయాలు జరపకుండా చేర్యాల మునిసిపాలిటీకి అప్పగించాలని అఖిలపక్షంగా డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఈ భూముల్లో జెండాలు పాతి పేద ప్రజలతో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరయ్య, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఒగ్గు రాజు, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్, సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, సిపిఎం టౌన్ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండ కింది అరుణ్ కుమార్, ముస్త్యాల ప్రభాకర్,రాళ్ల బండి భాస్కర్, బోయిని మల్లేశం, ఇప్పకాయల శోభ, రాళ్ల బండి చందు, ఎర్ర బోస్ అశోక్, మెరుగోజు ప్రవీణ్, బొంగోని భాస్కర్, నక్క బాలరాజు, టి ఎమ్మార్పీఎస్ నాయకులు భూమిగారి నర్సింలు, భూమిగారి కిషోర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు గొర్రె శ్రీనివాస్, రేపాక కుమార్, పొనుగోటి శ్రీనివాస్, రెడ్డి, తాడూరి నర్సింలు, గుండ్ర రవీందర్, గర్నపెల్లి చంద్రం, కృష్ణమూర్తి, బ్రహ్మయ్య,పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్