యువకులు అన్ని రంగాల్లో ముందుండాలని సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ లో ఆమె నివాసంలో దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాస్టర్ బురాని శ్రీకాంత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేజ, మైనార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వర్ మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి యువకులు ఎల్లవేళలా కృచేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో యువతను బలోపేతం చేయడానికి ఆమె ఎల్లవేళలా ముందుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.
