వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారం కై రేపు ఛలో సురభి మెడికల్ కాలేజీ..
పిలుపునిచ్చిన వివిధ విద్యార్థి యువజన సంఘాలు.
సిద్దిపేట జిల్లా జూలై 12
వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారం కై రేపు ఛలో సురభి మెడికల్ కళాశాల నిర్వహిస్తున్నట్టు పీ.డీ.ఎస్.యు, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐపిఎస్యు, పీవైఎల్,యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు ప్రకటించారు.ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐపిఎస్యు, పీవైఎల్,యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు ఎస్.వి.శ్రీకాంత్,మన్నె కుమార్,జెరిపోతుల జనార్ధన్, అజ్మత్,అనిల్, వహబ్ మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామంలో ఉన్న సురభి ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యం కాలేజీలో చదువుతున్నా వైద్య విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారని ,హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాసిరకమైన భోజనం అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల అనారోగ్యాలకు కారణం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ దశలో ఉన్న కళాశాల భవనంలోనే విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారన్నారు. మొన్నటికి మొన్న పదిహేను మంది వైద్య విద్యార్థుల వీరుపెట్టిన కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు.సురభి ప్రైవేటు మెడికల్ కళాశాల పై చర్యలు తీసుకోవాలని పదిరోజులుగా ఆందోళనలు చేసి,జిల్లా ఉన్నత అధికారులను కలిసిన ఇప్పటి వరకు సంబంధిత కాలేజీ పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.తక్షణమే కళాశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐపిఎస్యు, పీవైఎల్,యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు సంగెం మధు,ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
