*అసిఫాబాద్ జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయండి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ మల్లికా కన్వేషన్ లో ఈ రోజు జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర విద్యా శాఖామాత్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలను సన్మానించారు.
ఈ సందర్భంగా సిర్పూర్ నియోజక వర్గానికి సంబంధించిన పలు విద్యా అంశాలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యులు తగు ఆదేశాలు ఇస్తామని తెలియజేశారు.
ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ , రాజ్యసభ సభ్యులు శ్రీ డా.లక్ష్మణ్ , శాసన సభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి , భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
