ప్రాంతీయం

రామ సుబ్రహ్మణ్యస్వామి మోడీ ప్రవేశపెట్టిన పథకాల గూర్చి…

123 Views

     ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4 చికోడు గ్రామంలో తమిళనాడు నుండి విచ్చేసిన రామ సుబ్రహ్మణ్యంతో బిజెపి నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పరచుకొని ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పట్టణంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ప్రతిఇంటి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరకువెళ్లి కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించిన విషయాల గురించి బూత్ అధ్యక్షులను తెలుసుకుని సంభాషణలు చేశారు. అనంతరం ఆయనకు సగౌరవంగా సాల్వాతో సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో బూతు అధ్యక్షులు ఊరడి రాజు యాదవ్, బాధ నరేష్, ఆశ సురేష్, సుధాకర్ రెడ్డి, గూడ బాలరాజు రెడ్డి, గున్నాల రమేష్ గౌడ, సాయి గౌడ్, మెతుకు మల్లయ్య, లింగాల ఎల్లయ్య, గూడ బాలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *