ప్రాంతీయం

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన క్యాసారం గ్రామానికి చెందిన పుల్ల సంధ్య

596 Views

ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చెందిన పుల్ల సంధ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం గ్రామం కు చెందిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు విద్యార్థి పుల్లసంధ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, ఆవిష్కార్ కాలేజీ యాజమాన్యం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి పుల్లసంధ్య ఆవిష్కార్ కాలేజీలో మంచి స్టడీ సిలబస్ కాలేజీ యాజమాన్యం చెప్పి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ముందుండి నడిపించినందుకు విద్యార్థి సంధ్య కాలేజీ యాజమాన్యానికి మరియు తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినందుకు ధన్యవాదాలు చెప్పింది. విద్యార్థి సంధ్యకి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చినందుకు క్యాసారం గ్రామం లోని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *