ప్రాంతీయం

నిషేధిత అంబారు బ్యాగులను పట్టుకున్న పోలీసులు

58 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*నిషేధిత అంబర్ బ్యాగులను అక్రమంగా రవాణా చేస్తున్న పట్టుకున్న దండేపల్లి పోలీసులు*

*వీటి విలువ సుమారు 6,00,000- రూపాయలు.*

రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి, ఆదేశాల ప్రకారం మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చెలుక గూడెం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా జన్నారం వైపు నుండి వస్తున్న అశోక లీలాండ్ వ్యాన్ TS 19 TA 3574 ఆపి తనిఖీ చేయగా సంచులలో ప్రభుత్వంచె నిషేడించబడిన పొగాకు అంబర్ బ్యాగులను అశోక లీలాండ్ వాహనంలో గుర్తించడం జరిగింది. వ్యాన్ లో అక్రమంగా రవాణా చేస్తున్న *1, బోడ మోహన్, s/o భూలియా, వ. 35 సం, కు. లంబడ (ST), వృత్తి: వ్యాపారం, నివాసం: లక్ష్మీపూర్ తండా, జన్నారం మండలం.*

*2. బనావత్ సంతోష్, s/o సామ నాయక్, వ. 37 సం, కు. లంబడ (ST), వృత్తి: వ్యాపారం, నివాసం: బంగారి తండా, జన్నారం మండలం*, లను అదుపులోకి తీసుకోని ఇద్దరినీ మరియు నిషేధిత అంబర్ సంచులను పోలీస్ స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై జి.ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

*అట్టి వాహనంలో (24) అంబర్ సంచులు కలవు, ఒక్కో సంచి (26) కే‌జిలు ఉంటుంది మరియు ఒక్కో సంచి యొక్క విలువ 25,000/- రూపాయలు ఉంటుంది. వీటి మొత్తం (624) కే‌జిల అంబర్ ఉంటుంది. మొత్తం విలువ 6,00,000/- ఉంటుంది.*

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్