మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం లోని బుక్క గూడెం అడవి గుట్టల్లో చిరుత పులి సంచరిస్తుందని గొర్రెల కాపరులు మరియు పశువుల కాపరులు సమాచారం తెలియజేశారు.
నేడు గొర్రెల కాపరులు, గొర్రెల మందను మేపడానికి హాజీపూర్ మండలంలోని బుక్క గూడెం అటవీగుట్టలోకి గొర్రెల మందను తీసుకెళ్లారు. అక్కడ హఠాత్తుగా, ఒక్కసారిగా చిరుత పులి అమాంతం గొర్రె పై దాడి చేసి రక్తాన్ని తాగి మరియు గొర్రెపిల్లను నోట్లో పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. అది చూసిన గొర్రెల కాపరులు మరియు పశువుల కాపరులు ప్రాణ భయంతో పరుగులు తీసి విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
హాజీపూర్ మండల ప్రజలు చిరుత పులి విషయంలో అతి జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు ప్రజలకు తెలియజేశారు.
