ప్రాంతీయం

ఫుడ్ పాయిజన్ అయిన కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి…

91 Views
ముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 12న గురుకుల విద్యార్థులు ఎన్నో ఆశలతో చిగురించిన విద్యకుసుమం నెలరాలింది అని భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లీక్ పల్లి  గ్రామానికి  చెందిన విద్యార్థి ప్రశాంత్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులు గా మృత్యువుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు ఆరవ తరగతి చదువుతున్న ప్రశాంత్ ఈనెల 12న బడిలో తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ అవ్వడంవల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అని ప్రశాంత్ తో పాటు మరో 24 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో సతమతం అయ్యారు అని వీరిలో ప్రశాంత్ పరిస్థితి విషమంగా వుండటంతో 13న హైద్రాబాద్ తరలించారు ఐదు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి రెయిన్ బో ఆసుపత్రిలో మంగళవారం చనిపోవడం జరిగిందని మిగిలిన విద్యార్థులలో సికింద్రాబాద్ గాంధీలో ముగ్గురు ఉస్మానియాలో ఇద్దరు విద్యార్థులు భువనగిరి జిల్లాలో ఏడుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు చనిపోయిన విద్యార్థులకి 10 లక్షల ప్రభుత్వ తరపున పరిహారం చెల్లించాలి అలాగే మిగిలిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ తో మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని విద్యార్థి శాఖను కోరడం జరుగుతుంది. పై తెలిపిన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కొడం వెంకటేష్  బైరగోని హర్శిత్, కొడంనరేష్. వసిం అక్రం. సమీ. సుదీప్. వంశి తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7