టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ మంచిర్యాల అధ్యక్షులు శ్రీ గడి, శ్రీహరి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ని కలిసి హౌసింగ్ సొసైటీ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగినది.
ఇప్పటివరకు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసే ఇంటి నిర్మాణం పనులు మధ్యలో నిలిపివేయబడి ఉన్నవి వాటి గురించి ఎమ్మెల్యే తో చర్చించి వీలైనంత త్వరలో నిర్మాణ పనులు మొదలుపెట్టేటట్లు చూడాలని కోరనైనది దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారం రోజుల లోపు మీయొక్క సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసి నిర్మాణ పనులు మొదలయ్యేటట్లు తనే దగ్గరుండి చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. దీనికి అధ్యక్షుడు కార్యదర్శి మరియు సమస్త కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.





