ప్రాంతీయం

కాంగ్రెస్ అంటేనే పేదలపార్టీ రాష్ట్రనాయకుడు……

78 Views

ముస్తాబాద్, జూలై 7 (24/7న్యూస్ ప్రతినిధి):  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయపార్టీ పేదలపార్టీ ప్రజలకొరకే ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలుపుగోలుగా ఉండి విధివిధానాలు ప్రస్తావనలు చేయగా జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ నాయకులు పలు విషయాలను చిత్రీకరించి పక్కదారి పట్టిస్తున్నారన్నారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పిన అంతటితో ఆగలేక దుష్ప్రచారాలు వెల్వెత్తుతూ బిఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్యన్నారు. ఇప్పటికైనా పేదలపాటిపై దుష్ప్రచారాలు మానండి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, అంజన్ రావు, తోట ధర్మేందర్, శ్రీకాంత్, విష్ణు, శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్