ప్రాంతీయం

రైతు భరోసా వెంటనే అమలు చేయాలి

58 Views
  • రైతు భరోసా వెంటనే అమలు చేయాలి – బట్టు అంజిరెడ్డి

రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలి

బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు మేలు

సిద్దిపేట జిల్లా జూన్ 29

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంనే రైతు భరోసాగా పేరుమార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని, ఇంతవరకు తెలంగాణలో ఏరైతుకు కూడా ఆర్థికసాయం అందించలేదని బట్టు అంజిరెడ్డి అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని రైతువేదిక లో నిర్వహించిన రైతుసమావేశంలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబందును సకాలంలో ఇచ్చి రైతులను ఆర్థికంగా అదుకున్నామని,ఇప్పటి ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఆయన ఆరోపించారు. వ్యవసాయాన్ని విస్తరిస్తేనే సమాజంలో ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుందని,తద్వారా ప్రభుత్వనికి కూడా ఆదాయం పెరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుభీమా పథకంద్వారా తెలంగాణలో ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నామని, ఇప్పటి ప్రభుత్వం రైతుబీమా పథకంను కొనసాగిస్తారా,లేదా అనేది స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్