దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 90 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, ప్లేట్స్ గజ్వేల్ కు చెందిన యువకులు కుమార్, తిరుపతి, కుమార్, సురేష్, జాంగిర్ బాబు లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. గ్రామానికి చెందిన పోతరాజు రవీందర్ జ్ఞాపకార్థం విద్యార్థులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు….
