కొమురం భీం జిల్లా
*పోడు రైతుల సమస్యలను పరిష్కరించండి – సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు*
*కాగజ్ నగర్* : పట్టణంలోని ఆదర్శనగర్ మరియు ఆర్ఆర్ఓ క్యాంపులో ఏర్పాటుచేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఈజ్ గాం విలేజ్ నం.12 లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కాగజ్ నగర్ పట్టణంలో అర్బన్ వాటర్ సప్లై స్కీంను సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఇంఛార్జి మంత్రి వర్యులు శ్రీమతి సీతక్క .
ఈ సందర్భంగా శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోడు భూముల సమస్య సిర్పూర్ నియోజకవర్గంలో చాలా తీవ్రంగా ఉందని వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అన్నారు. గతంలో కేసిఆర్ ప్రభుత్వం పోడు రైతుల పై దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించిందని, కనీసం కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించి వారికి శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క స్పందిస్తూ పోడు రైతులు కొత్తగా అటవీభూములను కొట్టొద్దని ఉన్న పోడు భూములను మాత్రం సాగు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దౌత్రే , జాయింట్ కలెక్టర్లు తివారీ , వేణు గారు, జడ్పీ ఇంఛార్జి చైర్మన్ కోనేరు కృష్ణ మరియు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సంబధిత అధికారులు పాల్గొన్నారు.





