వీరవనిత జన్సీలక్ష్మీబాయ్, భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని సబ్బుబిళ్ళ పై జాన్సీలక్ష్మీబాయ్, ఇందిరాగాంధీ చిత్రాలను అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తల్లి జాన్సీలక్ష్మి బాయ్ అంటేనే సాహసం, బ్రతికింది సంవత్సరాలు అయితేనేం ఆమె ఓ ఒరవడి. సదా అవరోధాలు, అనుమానాలు వెంబడించి ప్రాణం ఉన్నత వరకు ఆంగ్లేయుల పరిపాలనను స్వీకరించలేదు. స్వతంత్ర సంగ్రాసమంలో ప్రముఖ పాత్ర వనిత, భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ సేవలందించారని అన్నారు. స్త్రీలకు గౌరవం తెచ్చే విధంగా ప్రపంచ సమాజంలో, ముఖ్యంగా మహిళా సాధికారత సంస్థ నుండి అపారమైన గౌరవాన్ని పొందరన్నారు. ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలనంతగా జనరంచకపాలన చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత అన్నారు.




