*రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ – ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు*
25 జూన్ 1975 రోజున అప్పటి ప్రధాని ఇందిరగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ విధించిన ఎమర్జెన్సీ దినాన్ని “ప్రజాస్వామ్యానికి చీకటి రోజు” గా జరుపుతూ ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 25 జూన్ 1975 రోజున ఎమర్జెన్సీ విధించడం బాధాకరం అని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని బీజేపీ పార్టీ పై దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు. ఆనాడు విధించిన ఎమర్జెన్సీ దినాన్ని ఒక్క చీకటి రోజుగా గుర్తిస్తూ ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా జరూపుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ భారత దేశానికి ఒక్క మాయని మచ్చ అని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 21 నెలల పాటు ఎమర్జెన్సీ ని విధించింది అని ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది అని తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని తప్పుడు ప్రచారం చేస్తుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, రజనీష్ జైన్, దుర్గం అశోక్, పట్టి వెంకట కృష్ణ, కొయ్యల ఎమాజీ, జోగుల శ్రీదేవి, ముదాం మల్లేష్, దీక్షితులు, గుండా ప్రభాకర్, బోయిని హారి కృష్ణ, కషెట్టి నాగేశ్వర్ రావు, రమణ రావు, మోటపలుకుల తిరుపతి, అక్కల రమేష్, రాచర్ల సంతోష్, జాడి తిరుపతి, దార కల్యాణి, రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
