శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో
వర్షాల కోసం మహా శివునికి జలాభిషేకాలు
…శ్రీరామకోటి రామరాజు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 26)
సిద్దిపేట జిల్లా,గజ్వేల్:
వర్షాలు సకాలంలో కురువాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో మహాశివునికి పంచామృత అభిషేకాలు, జలాభిషేకాలు ఘనంగా నిర్వహించి ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తు మహాశివుణ్ణి వేడుకున్నారు.
ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ వర్షాలు సంమృద్ధిగా కురిస్తేనే పాడిపంటలు బాగా పడుతాయని. తద్వారా వ్యవసాయం ముందుకు సాగుతుందన్నారు. దేశానికి రైతే వెన్నుముఖ. అలాంటి రైతు సుఖంగా జీవించకుంటే పరిపాలన కూడా ఆస్థవ్యస్తంగా మారుతుందన్నాడు. అందుకే వర్షాలు కురిషి రైతు చల్లగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు తుమ్మ శ్రీనివాస్, అంరాది రమేష్, మెతుకు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.





