ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, తండ్రి పర్వతాలు, వయసు 37 సంవత్సరాలు, కులం యాదవ, గ్రామం కాశిపేట్, మండలం తాండురు, లారీ ఓనర్ అయిన అనుముల శ్రీకాంత్, గ్రామం కొదురుపాక, లారీ నెంబర్ టిఎస్.02.యుబి.2193 గలదానితో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలుపగా అట్టి లారీతో పాటు అతన్ని అదుపులోకి తీసుకొని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ మరియు ఓనర్ పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ టి.శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపినారు.




