*స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి!*
*బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ డిమాండ్.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లూ ఖరారయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రచార కరపత్రాలను మంచిర్యాలలోని బీసీ భవన్ లో వారు ఆవిష్కరించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని వారు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామిని నిలబెట్టుకోవాలని వారు తెలిపారు. రిజర్వేషన్లన్ని తేల్చడం కోసం ముందుగా బీసీ జన గణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. బీసీలు అంటే వెనుకబడిన వారు కాదని.. వెనక్కు నెట్టి వేయబడిన వారని వారు పేర్కొన్నారు. జనాభా కి అనుగుణంగా సామాజిక వాటా దక్కితేనే ప్రజాస్వామ్యం నిలబడినట్టు అవుతుందని వారు తెలిపారు.
మరోమారు మోసగించబడడానికి బీసీలు సిద్ధంగా లేరని.. తమ న్యాయమైన హక్కుల కోసం బీసీ బిడ్డలు ఉద్యమించాలని బీసీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు చలమల్ల అంజయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతే రామదాసు, మోర చరణ్ కుమార్, రమేష్ కుమార్, బీసీ నాయకులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
