మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం
నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో శానిటేషన్ కార్మికులను పెంచాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ని కోరిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్ గౌరవ కౌన్సిలర్లు, కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్యని పరీక్షిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
పెండింగ్ లో ఉన్న 15th ఫైనాన్స్ నిధులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.
మార్కెట్ సముదాయాల భవనాన్ని వెంటనే పూర్తి చేసి వ్యాపారస్తులకు అప్పగించాలని కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడం జరిగింది.
కలెక్టర్ కుమార్ దీపక్ గారికి బెల్లంపల్లి సమస్యలను ఎమ్మెల్యే వినోద్ గారు వివరించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్, గౌరవ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
