నూతన కార్యవర్గం ఎన్నిక….
ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు
/ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కుల సంఘ సభ్యుల ఐక్యతకు వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సభ్యుడు కుల సంఘ తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఎవరు ఉల్లంఘించవద్దని పేర్కొన్నారు అనంతరం అధ్యక్షులకు పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు సభ్యులందరూ స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా దేశ్పాండే ఆంజనేయులు ఉపాధ్యక్షులుగా ఎలవేణి రాజయ్య. ఉత్తర్ల గంగయ్య పడిగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా రెండ్ల రవీందర్ కార్యదర్శిగా కనకట్ల తిరుపతి కోశాధికారిగా బొమ్మన వేణి సత్యం వ్రాతకునిగా ఇమ్మడి రామచంద్రం కార్యవర్గ సభ్యులుగా జిన్నబాబు ఉత్తర్ల దేవయ్య పిట్ల శ్రీనివాస్ సాయిలు 16 గ్రామాల కుల సభ్యులు పాల్గొన్నారు.




