మండేపల్లి 18, నవంబర్ 2022:
ఐడీటీఆర్ ( ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ లో మరింత ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.
శుక్రవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోనీ ఐడీటీఆర్ వార్షిక సాధారణ సమావేశం సొసైటీ మెంబెర్స్ తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
గత సంవత్సరం జూలై 1 నుంచి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెలాఖరు వరకు 405 మందికి శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారని ఐటీడిఆర్ బాధ్యులు జిల్లా కలెక్టర్ కు చెప్పారు. వీరీలో 295 మంది శిక్షణను పూర్తి చేసుకున్నారని, 172 మందికి ప్లేస్ మెంట్ కల్పించామని ఐటీడీ ఆర్ బాధ్యులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
గత సంవత్సరం ఐటిడిఆర్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సాధించిన పురోగతి వచ్చే సంవత్సరం చేపట్టబోయే కార్యక్రమాలను కలెక్టర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచేందుకు
రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవ తో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీడీఆర్ సామర్థ్యం మేరకు బ్యాచ్ లను పెంచి శిక్షణ ఇవ్వాలన్నారు.
ఐటీ డి ఆర్ ఆదాయం పెరిగేలా ప్రాయోజిత శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఐటీ డి ఆర్ తెలంగాణ కే మణిహారం అని…. సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రంలో శిక్షణ పొందడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్న విషయం యువతకు వెళ్లేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
సమావేశంలో ఐటీడీఆర్ సొసైటి సెక్రెటరీ నుజుం రియాజ్, కోశాధికారి అనురాగ్ కనున్గో , మెంబర్ లీగల్ ఆశిస్ మిశ్రా, సభ్యులు అమిత్ జైన్ , మీనా ఆర్ఎస్ , సి రమేష్ ,సీతారాములు, జే గణేష్ , రాజు సంగ్వి, బెన్నూర్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
