సిద్దిపేట జిల్లా గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిది లోని 7వ వార్డుకు చెందిన శ్రీరామ్ యాదగిరి అనే అతను బిల్డింగ్ పై నుండి జారి కింద పడి పోగా నడుముకి దెబ్బ తగిలి రెండు కాళ్లు పనిచేయక అతని భార్య మాధవి మంచం మీదనే సపరిచర్యలు చేస్తుంది. అతనికి ఇద్దరు పిల్లలు రామ్ చరణ్,చైతన్యలు ఉన్నారు. వీరు కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు విషయం తెలుసుకున్న చెలిమి ఫౌండేషన్ సభ్యులు 35 వ సేవా కార్యక్రమం. చెలిమి ఫౌండేషన్ తరపున 3500 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు, మరియు 6500 రూపాయల నగదును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్,చెలిమి ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్,కోశాధికారి దొంతుల ఆనంద్, తెరాస పార్టీ పట్టణ యూత్ అద్యక్షులు గడియారం స్వామి చారి, చెలిమి ఫౌండేషన్ సభ్యులు పిట్ల ఆంజనేయులు, గుంటుకు శ్రీనివాస్, టెంట్ నర్సింలు, నాగపురి రమేశ్,గంగిశెట్టి నర్సింలు,చెపూరి సంతోష్, యాట ఆంజనేయులు, గంగిశెట్టి రమేశ్, పెద్దూరి శ్రీనివాస్, నందాల కృష్ణ, తూము దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
